Sircilla: సిరిసిల్లలో ముగిసిన రాష్ట్రస్థాయి బాలికల క్రికెట్ టోర్నీ!
Sircilla: సిరిసిల్ల రంగినేని సుజాత ట్రస్ట్ మైదానంలో అండర్-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలు. విజేత రంగారెడ్డి జట్టుకు జిందం కళా శుభాకాంక్షలు.
Sircilla: సిరిసిల్లలో ముగిసిన రాష్ట్రస్థాయి బాలికల క్రికెట్ టోర్నీ!
Sircilla: సిరిసిల్లలో ముగిసిన రాష్ట్రస్థాయి బాలికల క్రికెట్ టోర్నీ! సిరిసిల్ల పట్టణం లోని రంగినేని సుజాత మోహన్ రావు ట్రస్ట్ మైదానంలో నిర్వహించిన అండర్–17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ సాగర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థినుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందిస్తాయని అన్నారు. స్నేహభావం, ఐకమత్యం, క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.
ప్రస్తుత కాలంలో బాలికలకు క్రీడారంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని అన్నారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారిణులతో పాటు నిర్వాహకులను, క్రీడాకారిణులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు.
టోర్నమెంట్‌లో విజయం సాధించిన రంగారెడ్డి జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ మొదటి వారంలో జమ్మూ కాశ్మీర్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లోనూ విజయం సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో క్రికెట్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని క్రీడాకారిణులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో రంగినేని ట్రస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ తుడి వెంకట్రావు, జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి అజ్మీర్ రాందాస్, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ జోగినిపెల్లి రవీందర్ రావు, దేవతా ప్రభాకర్, టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడా ప్రతినిధులు, కోచ్‌లు, క్రీడాకారిణులు తదితరులు పాల్గొన్నారు.




