Kondagattu: కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం పూర్వజన్మ సుకృతం: స్పీకర్ ప్రసాద్!
Kondagattu: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతమని శుక్రవారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
Kondagattu: కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం పూర్వజన్మ సుకృతం: స్పీకర్ ప్రసాద్!
మల్యాల (కొండగట్టు): జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం తన పూర్వజన్మ సుకృతమని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆహ్వానం మేరకు ఆయన ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. 60 ఏళ్లకోసారి చందనం తొలగించే ఈ అరుదైన ఘట్టంలో స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులు తొలగి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఎన్నికల హామీలను నెరవేర్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రజా ప్రభుత్వానికి స్వామివారు సంపూర్ణ శక్తిని ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీర దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం వందల కోట్లు వెచ్చిస్తోందని, కొండగట్టు ఆలయాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.




