Sircilla: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి!

Sircilla: సిరిసిల్ల జిల్లా ఔట్‌సోర్సింగ్ జేఏసీ కమిటీని రాష్ట్ర జేఏసీ నాయకులు సన్మానించారు. ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 10 Oct 2026 12:11 PM IST
Sircilla
X

Sircilla: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి!

Sircilla: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యతకు, హక్కుల సాధన కోసం చేపట్టే ఉద్యమాలకు రాష్ట్ర జేఏసీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీని అభినందించేందుకు విచ్చేసిన రాష్ట్ర జేఏసీ చైర్మన్, అధ్యక్షులు పులి లక్ష్మయ్య, రాష్ట్ర జేఏసీ జనరల్ సెక్రటరీ డి. శ్రీనివాస్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ డి. శ్రీధర్ జిల్లా జేఏసీ అధ్యక్షులు వేముల లక్ష్మి రాజాంతో పాటు కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలను రాష్ట్ర జేఏసీ దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారం కోసం రాష్ట్రస్థాయిలో తగిన కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ప్రస్తుత ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేలా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నాయకులు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, వారి న్యాయమైన హక్కులను పరిరక్షించాలని కోరారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

రాష్ట్ర జేఏసీ నాయకులు ఇచ్చిన భరోసా జిల్లా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి, తమ హక్కుల సాధన కోసం శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాన్ని కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA