Karimnagar: విద్యారంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: USFI
Karimnagar: విద్యారంగంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, సంక్షేమ హాస్టళ్లకు దోమతెరలు ఇవ్వాలని కరీంనగర్‌లో జరిగిన USFI సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి డిమాండ్ చేశారు.
Karimnagar: విద్యారంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: USFI
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోటలోని యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి హాజరైనారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగంపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. విద్యారంగంలో పాఠశాల విద్య మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని శాఖలలో పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల చదువు సాగేదెలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పాఠశాల స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాలకు డీఈవోలు లేరని దీనివల్ల బడులలో పర్యవేక్షణ కోరబడుతుందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో 19 కాలేజీలకు అధ్యాపక పోస్టులే మంజూరు చేయలేదని దీనివల్ల విద్యార్థులకు చదువు ఎలా అనుచుతుందని ప్రశ్నించారు మరియు డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీలలో దాదాపు 20094 పోస్టులు ఖాళీలు ఉన్నాయని వీటిని భర్తీ చేయకుండా విద్యరంగం ఎలా అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అదేవిధంగా నూతన జిల్లాలు ఏర్పడినప్పటి కూడా డీఈవోలు ఇన్చార్జిలను కొనసాగించడం వల్ల చదువు కుంటూ పాడి ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు తక్షణమే దోమతెరలను అందించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో దశలవారీగా రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న వారు జిల్లా కార్యదర్శి సంద గణేష్ హేమంత్ మని తేజ అరుణ్ సాయి సంపత్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.




