Manthani: వియత్నాం విద్యా పర్యటనకు ఎంపికైన మంథని గణిత ఉపాధ్యాయుడు!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని జెడ్పీహెచ్‌ఎస్‌ గణిత ఉపాధ్యాయుడు భరత్ రెడ్డి వియత్నాం విద్యా పర్యటనకు ఎంపిక. అభినందించిన పాఠశాల సిబ్బంది, స్థానికులు.

SHANKAR, MANTHANI
Published on: 25 Sept 2026 1:07 PM IST
Manthani
X

Manthani: వియత్నాం విద్యా పర్యటనకు ఎంపికైన మంథని గణిత ఉపాధ్యాయుడు!

Manthani: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ, ఎస్ సి ఈ ఆర్ టి హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల ఎక్స్‌పోజర్ విజిట్, ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద వియత్నాం దేశ పర్యటనకు పెద్దపల్లి జిల్లా మంథని జెడ్పిహెచ్ ఎస్ బాలికల పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు భరత్ రెడ్డి ఎంపికయ్యారు.

ఈ విద్యా పర్యటన 10.10.2026 నుండి 17.10.2026 వరకు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను ఎంపిక చేసి అంతర్జాతీయ విద్యా విధానాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భరత్ రెడ్డి గణిత బోధనలో చూపిస్తున్న ప్రతిభ, విద్యార్థుల పట్ల అంకితభావంతో పనిచేస్తుండటంతో ఆయన ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. వియత్నాంలోని విద్యా సంస్థలను సందర్శించి అక్కడి బోధనా పద్ధతులను తెలుసుకుని రాష్ట్రంలో అమలు చేసేందుకు ఈ పర్యటన దోహదపడుతుంది ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, మంథని ప్రజలు భరత్ రెడ్డి కి అభినందనలు తెలిపారు. ఆయన పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI