Tangallapalli: తంగళ్లపల్లి ఇందిరమ్మ కాలనీ వేడుకల్లో కేకే మహేందర్ రెడ్డి!

Tangallapalli: తంగళ్లపల్లి ఇందిరమ్మ కాలనీ దీపావళి వేడుకల్లో పాల్గొన్న కేకే మహేందర్ రెడ్డి. పేదల సొంతింటి కలే ఇందిరమ్మ పథకం లక్ష్యమని వ్యాఖ్య.

KALEEM, SIRICILLA
Published on: 9 Nov 2026 7:48 AM IST
Tangallapalli
X

Tangallapalli: తంగళ్లపల్లి ఇందిరమ్మ కాలనీ వేడుకల్లో కేకే మహేందర్ రెడ్డి!

Tangallapalli: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయని, సొంతింటిలో దీపావళి పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని, స్వీట్లు పంపిణీ చేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA