Korutla: కోరుట్ల పట్టణంలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు!

Korutla: కోరుట్ల పట్టణ ప్రజలకు భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల అధికారులను ఆదేశించారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 5 Nov 2026 3:09 PM IST
Korutla
X

Korutla: కోరుట్ల పట్టణంలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు!

Korutla: కోరుట్ల పట్టణ ప్రజలకు భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల సూచించారు.

ఈ సందర్భంగా ఏకిన్ పూర్ శివారులో గల ఎస్సారెస్పీ (SRSP) దగ్గర గల నుంచి తాళ్ల చెరువుకు అలైన్‌మెంట్ ద్వారా నీటిని నింపి, అక్కడి నుంచి నీటిని శుద్ధి (ఫిల్టర్) చేసి పట్టణ ప్రజలకు తాగునీరు అందించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే తెలిపారు.

మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఏవైనా అంతరాయాలు ఏర్పడిన కరువు పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో ఈ ప్రత్యామ్నాయ విధానం ద్వారా పట్టణ ప్రజలకు నిరంతరాయంగా తాగునీటిని అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

అలైన్‌మెంట్ పనుల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత రైతులతో ముందస్తుగా చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఈ ప్రత్యామ్నాయ నీటి సరఫరా విధానం అందుబాటులోకి వస్తే కోరుట్ల పట్టణంలో భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తకుండా నివారించవచ్చని ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జీవకర్,ఎమ్మార్వో కృష్ణ చైతన్య ,మున్సిపల్ కమిషనర్ ఇరిగేషన్,రెవిన్యూ మరియు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA