Jagtial: జగిత్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం!

Jagtial: జగిత్యాల చింతకుంట చెరువు వద్ద బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛతే సేవా భావం - స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు.

ANAND, JAGITYAL
Published on: 3 Oct 2026 4:12 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం!

Jagtial: సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని స్థానిక చింతకుంట చెరువు వద్ద "స్వచ్ఛతే సేవా భావం – స్వచ్ఛ భారత్" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి జగిత్యాల్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ బోగ శ్రావణి ముఖ్య అతిథిగా హాజరై శ్రమదానం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్‌ను ఒక ప్రజా ఉద్యమంగా మార్చారని, పరిశుభ్రమైన పరిసరాలే ప్రజల ఆరోగ్యానికి మూలస్తంభాలని తెలిపారు. చెరువులు, కాలువలు, ప్రజా ప్రదేశాలలో చెత్త వేయకుండా పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా యువత ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

పరిసరాల పరిశుభ్రత లోపిస్తే వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని, "స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలి మెట్టు" అనే సందేశాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. "పరిశుభ్రమైన జగిత్యాల – ఆరోగ్యకరమైన జగిత్యాల" లక్ష్య సాధనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, పట్టణ అధ్యక్షుడు కశెట్టి తిరుపతి, కౌన్సిలర్లు వేముల శ్రీనివాస్, నిమ్మల నాగరాజు, గట్టిపెళ్లి జ్ఞానేశ్వర్, సిరిపురం శ్రీనివాస్, జిల్లా, పట్టణ పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL