Sircilla: సిరిసిల్ల టౌన్ పీఎస్‌లో బీజేపీ స్వచ్ఛ భారత్ శ్రమదానం!
Sircilla: సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ పోలీస్ స్టేషన్’ కార్యక్రమం మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ వేళ శ్రమదానం పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు గోపి, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్.
Sircilla: సిరిసిల్ల టౌన్ పీఎస్‌లో బీజేపీ స్వచ్ఛ భారత్ శ్రమదానం!
సిరిసిల్ల: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవా ప్రయాణాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సేవా సంకల్ప అభియాన్”లో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో “స్వచ్ఛ భారత్” కార్యక్రమాన్ని నిర్వహించారు.
శుక్రవారం ఉదయం 7 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, పట్టణ పదాధికారులతో పాటు వివిధ మోర్చాల నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రజాసేవ అనేది కేవలం రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాకుండా సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సేవ, స్వచ్ఛతపై ప్రజల్లో నిరంతరం అవగాహన కల్పిస్తున్నారని, ఆ స్ఫూర్తితోనే సిరిసిల్లలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ప్రజలకు ప్రతిరోజూ సేవలందించే ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. స్వచ్ఛత అనేది ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా నిత్య బాధ్యతగా మారాలని అన్నారు.
“సేవా సంకల్ప అభియాన్” ద్వారా ప్రజల్లో సేవాభావం, సామాజిక బాధ్యత, స్వచ్ఛతపై మరింత అవగాహన కల్పించడమే లక్ష్యమని దుమాల శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపితో పాటు నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




