Peddapalli:ఓపీ, వార్డులు, ల్యాబ్, ఫార్మసీ విభాగాలను పరిశీలించిన డీసీహెచ్‌ఎస్!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని డీసీహెచ్‌ఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్.

RAMESH, DHARMPURI
Published on: 25 Nov 2026 1:44 PM IST
Peddapalli
X

Peddapalli:ఓపీ, వార్డులు, ల్యాబ్, ఫార్మసీ విభాగాలను పరిశీలించిన డీసీహెచ్‌ఎస్!

Peddapalli:పెద్దపల్లి జిల్లా,ధర్మారం మండలం నంది మేడారం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని DCHS సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులు, సిబ్బంది హాజరు, మందుల నిల్వ, పారిశుధ్యం తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఓపీ, వార్డులు, ల్యాబ్, ఫార్మసీ విభాగాలను స్వయంగా తిరిగి చూశారు.

రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య సేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉంచాలని ఆదేశించారు.ఈ తనిఖీలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI