Sircilla: పొలాల వద్ద అక్రమ విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొలాల వద్ద వన్యప్రాణుల వేట కోసం అక్రమ విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు.
Sircilla: పొలాల వద్ద అక్రమ విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ!
రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ పొలాల వద్ద వన్యప్రాణుల వేట కోసం అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు.
వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం, వన్యప్రాణులను చంపడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రమాదకర చర్యల వల్ల అటవీ జంతువులతో పాటు వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
ప్రజలు ఎవరూ ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడవద్దని, వన్యప్రాణుల వేటకు ప్రయత్నించే వారు కూడా ఇటువంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజలకు లేదా వన్యప్రాణులకు హాని కలిగించినట్లు గుర్తిస్తే బాధ్యులను ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు.




