Korutla: కోరుట్ల పట్టణంలో వీధికుక్కల బీభత్సం.. ఆరేళ్ల బాలుడిపై దాడి!
Korutla: కోరుట్ల పట్టణంలోని 21వ వార్డులో ఆరేళ్ల బాలుడు శిర్వేష్‌పై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.
Korutla: కోరుట్ల పట్టణంలో వీధికుక్కల బీభత్సం.. ఆరేళ్ల బాలుడిపై దాడి!
Korutla: కోరుట్ల పట్టణంలో వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా పట్టణంలోని 21వ వార్డులో ఆరేళ్ల చిన్నారి శిర్వేష్‌పై వీధికుక్క దాడి చేసి కరవడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. చిన్నారులపై వీధికుక్కలు దాడులకు పాల్పడుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.




