Karimnagar: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాల్లో దళారుల దందా అరికట్టాలి.. ప్రజావాణిలో సీపీఎం వినతి!
Karimnagar: కరీంనగర్ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాల పేరిట దళారులు రూ.6 నుంచి రూ.8 లక్షలు వసూలు చేస్తున్నారని, పారదర్శకంగా భర్తీ చేయాలని సీపీఎం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చింది.
Karimnagar: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాల్లో దళారుల దందా అరికట్టాలి.. ప్రజావాణిలో సీపీఎం వినతి!
కరీంనగర్: కరీంనగర్ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా 50 ఉద్యోగాలకు 1785 మంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారని, దీన్ని ఆసరాగా చేసుకొని దళారులు సుమారుగా ఒక్కో నిరుద్యోగి నుండి 6 నుండి 8 లక్షల వరకు వసూలు చేస్తూ ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు.
ఇందులో అవినీతి అధికారుల ప్రమేయం లేకుండా, రాజకీయ ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా అర్హులైన వారికి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, నిరుద్యోగులను మోసం చేస్తూ ఉద్యోగాలు కల్పిస్తామని మభ్యపెడుతూ డబ్బులు వసూలు చేస్తున్న దళారులను, అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి, ప్రెస్ మీట్ పెట్టి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు పుల్లెల మల్లయ్య, ఆసంపల్లి వినయ్ పాల్గొన్నారు.




