Peddapalli: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

Peddapalli: పెద్దపల్లిలో నిషా ముక్త్ భారత్ అవగాహన సదస్సులో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పాల్గొని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

RAJU, PEDDAPALLI
Published on: 13 Nov 2026 6:06 PM IST
Peddapalli
X

Peddapalli: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

పెద్దపల్లి: పెద్దపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్స్‌లో నిషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, యువతకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హాజరయ్యారు. ఆయనతో పాటు డీసీపీ భూక్యా రాంరెడ్డి, ఏసీపీ గజ్జి కృష్ణ, పెద్దపల్లి టౌన్ సీఐ, ఎస్సైలు తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ... మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, ఒక్కసారి అలవాటు పడితే ఆరోగ్యం, చదువు, కుటుంబం అన్నీ దెబ్బతింటాయని హెచ్చరించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని విద్యార్థులు, యువతకు పిలుపునిచ్చారు.

మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI