Ramagiri: యూట్యూబ్ చూసి బంగారం వేటకు వెళ్లి సొరంగంలో చిక్కుకున్న వ్యక్తి!
Ramagiri: శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి బంగారు గనుల సొరంగంలోకి బంగారం కోసం దిగిన వ్యక్తి తాడు తెగి చిక్కుకోగా, పోలీసులు, గ్రామస్తులు కాపాడారు.
Ramagiri: యూట్యూబ్ చూసి బంగారం వేటకు వెళ్లి సొరంగంలో చిక్కుకున్న వ్యక్తి!
Ramagiri: బంగారం దొరుకుతుందన్న ఆశతో బంగారు గనుల సొరంగంలోకి దిగి ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన నిన్న రామగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రామగిరి గోల్డ్ మైన్స్ లో బంగారం ఉందని, యూ ట్యూబ్ లో చూసిన కిష్టయ్య, పెంచలయ్య అనే ఇద్దరు వ్యక్తులు నెల్లూరు నుండి రామగిరి కి చేరుకున్నారు. అర్ధరాత్రి మూత పడిన గోల్డ్ మైన్స్ సొరంగం లోకి తాళ్ళ సాయంతో దిగిన కిష్టయ్య అనే వ్యక్తి తాడు తెగిపోవడంతో సొరంగం లో చిక్కుకు పోయాడు. విషయాన్ని పెంచలయ్య అనే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు, గ్రామస్థులు తాళ్ళ సాయంతో సొరంగంలో చిక్కుకు పోయిన కిష్టయ్యను ప్రాణాలతో కాపాడారు. బంగారం కోసం అత్యాశ తో ప్రాణం మీదకు తెచ్చుకున్న వ్యక్తులను పోలీసులు మందలించి పంపించారు.




