Sircilla: బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఐడీఓసీలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణిలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ అర్జీలు స్వీకరించారు.

KALEEM, SIRICILLA
Published on: 16 Nov 2026 3:38 PM IST
Sircilla
X

Sircilla: బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి!

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా ఐడీఓసీలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన బాలల నుంచి అర్జీలు స్వీకరించారు.

దివ్యాంగుల పెన్షన్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ఇందిరమ్మ ఇళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలని కోరుతూ బాలలు దరఖాస్తులు సమర్పించారు. ఈ అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల ద్వారా చర్యలు చేపడతామని తెలిపారు. బాలల హక్కులను పరిరక్షిస్తూ వారికి మెరుగైన భవిష్యత్తును అందించడమే ప్రత్యేక ప్రజావాణి ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బోర్డుపై 'చిల్డ్రన్ యూ ఆర్ ద ఫ్యూచర్.. ఫ్లై హై, వీ ఆర్ విత్ యూ' అనే సందేశాన్ని కలెక్టర్ రాసి సంతకం చేశారు.

ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అంజయ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా విద్యాధికారి విజయ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA