Yellareddypet: ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు!

Yellareddypet: ఎల్లారెడ్డిపేట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో రెండవ కార్తీక సోమవారం సందర్భంగా మహిళలు శివలింగానికి అభిషేకాలు, దీపారాధనలతో ప్రత్యేక పూజలు చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 23 Nov 2026 5:45 PM IST
Yellareddypet
X

Yellareddypet: ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు!

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి (సద్ది మద్దుల సంఘం) ఆలయంలో రెండవ కార్తీక సోమవారం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సోమవారం తెల్లవారుజామునే మహిళలు తలంటు స్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో ఆలయానికి చేరుకున్నారు. రాగి చెంబుల్లో తీసుకొచ్చిన జలంతో పాటు ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేశారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఓం నమఃశివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మహిళలు శివలింగాన్ని రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు. పూజల అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA