Sircilla: గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ మహేష్ గితే!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మికంగా తనిఖీ చేసి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Sircilla: గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ మహేష్ గితే!
గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, నిర్వహణ రికార్డులు, వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది విధుల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు పోలీస్ శాఖకు సంబంధించిన వెబ్ అప్లికేషన్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సిబ్బందికి సూచించారు.
స్టేషన్ పరిధిలో అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, అలాంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ తనిఖీలో ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, ఎస్ఐ బాలరాజు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.




