Sircilla: గ్రామాల్లో రాత్రి పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి.
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మికంగా తనిఖీ చేసి, రాత్రి పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు.
Sircilla: గ్రామాల్లో రాత్రి పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి.
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, నిర్వహణ రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. నమోదైన కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాత్రి వేళల్లో గ్రామాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేసి దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాలను తరచూ సందర్శిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యత, సైబర్ నేరాలు, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.ఈ తనిఖీలో సీఐ వెంకటేష్, ఎస్ఐ రమేష్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




