Sircilla: సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు!
Sircilla: ఈ నెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ మహేష్ బి. గితే.
Sircilla: సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు!
Sircilla: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 30న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే బుధవారం పోలీస్ అధికారులతో కలిసి సీఎం పర్యటనకు సంబంధించిన భద్రతా, ఇతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, పార్కింగ్ కోసం కేటాయించనున్న ప్రదేశాలను పరిశీలించిన ఎస్పీ.. భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీవీఐపీ, వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలు, అత్యవసర సేవల నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.
ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ డీఈ శాంతయ్య, ఎస్‌ఐలు గణేష్, నాగరాజు, రాజు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.




