Sircilla: సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Sircilla: సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సామాన్య వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి, సప్తర్షుల బోధనలతో మహర్షిగా మారి, ఆదికావ్యమైన రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. కృషి, నిబద్ధత ఉంటే మనుషులు ఋషులుగా, మహాపురుషులుగా ఎదగవచ్చని, ఇందుకు వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు మధుకర్, రమేష్, సీఐ రవి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




