Sircilla: బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే!

Sircilla: సిరిసిల్ల జిల్లా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్వామివారిని దర్శించుకుని, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

KALEEM, SIRICILLA
Published on: 26 Oct 2026 12:26 PM IST
Sircilla
X

Sircilla: బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎస్పీకి తీర్థప్రసాదాలు అందజేశారు.

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సాయంత్రం నిర్వహించే రథోత్సవం సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA