Sircilla: నకిలీ లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ మహేష్ బి. గితే!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ లోన్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాల బారిన పడొద్దని ఎస్పీ మహేష్ బి. గితే ప్రజలకు సూచించారు.
Sircilla: నకిలీ లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ మహేష్ బి. గితే!
Sircilla: నకిలీ లోన్ యాప్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. తక్కువ వడ్డీతో తక్షణ రుణాలు అందిస్తామంటూ ఆకర్షించే గుర్తుతెలియని మొబైల్ యాప్స్‌ను నమ్మి సైబర్ మోసాల బారిన పడవద్దని హెచ్చరించారు.
లోన్ పొందడానికి ముందస్తుగా ఎలాంటి ఫీజులు చెల్లించవద్దని, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, వ్యక్తిగత సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తులతో పంచుకోవద్దని సూచించారు. రుణాలు పొందే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుర్తింపు పొందిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా మాత్రమే లావాదేవీలు జరపాలని స్పష్టం చేశారు.
ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అపరిచిత యాప్స్, లింకుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాజన్న సిరిసిల్ల పోలీసులు విజ్ఞప్తి చేశారు.




