Sircilla: కుటుంబ సమేతంగా భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్పీ మహేష్ బి. గీతే!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

BABU, VEMULAWADA
Published on: 3 Nov 2026 11:51 AM IST
Sircilla
X

Sircilla: కుటుంబ సమేతంగా భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్పీ మహేష్ బి. గీతే!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ మహేష్ బి. గీతే గారు కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

​ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఎస్పీ దంపతులకు ఆలయ అర్చకులు, వేద పండితులు , మంత్రోచ్ఛారణలు మరియు స్వస్తి వచనాలతో స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు.

​దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారు లడ్డూ ప్రసాదాన్ని అందజేయగా, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ శేష వస్త్రంతో ఎస్పీ గారిని సత్కరించారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA