Sircilla: పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం..ఎస్పీ మహేష్ బి. గితే!

Sircilla: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్థానిక హెబ్రోసు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 27 Oct 2026 1:18 PM IST
Sircilla
X

Sircilla: పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం..ఎస్పీ మహేష్ బి. గితే!

Sircilla: పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని స్థానిక హెబ్రోసు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

సమాజ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని చర్చి పాస్టర్లు, ఫాదర్లతో కలిసి ఎస్పీ మహేష్ బి. గితే ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు కలగాలని, సమాజంలో మతసామరస్యం, శాంతిసామరస్యాలు వెల్లివిరియాలని చర్చి ప్రతినిధులతో కలిసి ప్రార్థించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ శ్రీనివాస్, చర్చి పాస్టర్లు, ఫాదర్లు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA