Sircilla: సిరిసిల్లలో ఘనంగా 2కే రన్.. పాల్గొన్న ఎస్పీ మహేష్ బి. గితే!

Sircilla: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 28 Oct 2026 9:46 AM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో ఘనంగా 2కే రన్.. పాల్గొన్న ఎస్పీ మహేష్ బి. గితే!

Sircilla: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 2కే రన్ నిర్వహించారు. బుధవారం అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన ఈ రన్‌లో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, వాకర్స్‌తో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.. ప్రజల క్షేమం, రక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. అమరవీరుల ఆశయ సాధన కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు.

ప్రజా రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, పోలీసుల సేవలు, విధి నిర్వహణలో వారు ఎదుర్కొనే సవాళ్లపై ప్రజల్లో అవగాహన కల్పించడమేనని తెలిపారు.

ప్రజలు పోలీసులకు సహకరిస్తూ చట్టాలను గౌరవించాలని, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు.

ఈ 2కే రన్‌లో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేష్, ఆర్‌ఐ మధుకర్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, వాకర్స్ పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA