Sircilla: సిరిసిల్లలో దుర్గాదేవి మండపాలను సందర్శించిన ఎస్పీ మహేష్ బి. గితే!
Sircilla: సిరిసిల్ల పట్టణంలో దుర్గాదేవి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్పీ మహేష్ బి. గితే. నిమజ్జన శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం.
Sircilla: సిరిసిల్లలో దుర్గాదేవి మండపాలను సందర్శించిన ఎస్పీ మహేష్ బి. గితే!
Sircilla: దుర్గా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. ఉత్సవాల నిర్వహణ నుంచి నిమజ్జన శోభాయాత్ర ముగిసే వరకు పోలీసులకు సహకరించాలని నిర్వాహకులను కోరారు.
దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని పలు దుర్గాదేవి మండపాలను ఎస్పీ సందర్శించి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
జిల్లావ్యాప్తంగా ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు ముందస్తు ప్రణాళికతో పోలీసుల సూచనలు పాటిస్తూ, నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిమజ్జన శోభాయాత్రలో డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఏవైనా సమస్యలు తలెత్తినా, అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎస్పీ వెంట సీఐ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది ఉన్నారు.




