Boinpalli: బోయినపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Boinpalli: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మికంగా తనిఖీ చేసి, పెండింగ్ కేసుల పరిష్కారం, డ్రగ్స్ నివారణపై ఆదేశాలు ఇచ్చారు.
Boinpalli: బోయినపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయినపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందుతున్న పోలీస్ సేవలను పర్యవేక్షించే క్రమంలో ఈ తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. ప్రతి కేసులో చట్ట నిబంధనల ప్రకారం సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ రికార్డులు, కేసు డైరీలు, వివిధ రిజిస్టర్లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలపై తక్షణమే స్పందించి చట్టపరంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నేర నియంత్రణకు పెట్రోలింగ్, రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని, రౌడీషీటర్లు, పాత నేరస్తులు, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.
గంజాయి, డ్రగ్స్ తదితర నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా గ్రామాలు, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆన్లైన్ మోసాలు, ఓటీపీ, కేవైసీ మోసాలు, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్‌లు, డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలన్నారు.
అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదకర డ్రైవింగ్, మైనర్ల వాహన వినియోగం, మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగంపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రమాకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




