Sircilla: పీఎం రహత్ పథకంతో ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం!

Sircilla: రోడ్డు ప్రమాద బాధితులకు 'పీఎం రహత్' పథకం ద్వారా రూ. 1.5 లక్షల వరకు ఉచిత, నగదు రహిత వైద్య చికిత్స అందుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 29 Oct 2026 11:38 AM IST
Sircilla
X

Sircilla: పీఎం రహత్ పథకంతో ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం!

Sircilla: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులు పీఎం రహత్ (PM RAHAT) పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించి ప్రాణాలను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.

జిల్లా పరిధిలోని ఏడు ఆసుపత్రుల్లో పీఎం రహత్ పథకం కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. అర్హత నిబంధనలకు అనుగుణంగా రోడ్డు ప్రమాద బాధితులు గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు, ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్య చికిత్స పొందవచ్చని వెల్లడించారు.

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు వైద్య సహాయం అందించడం అత్యంత కీలకమని ఎస్పీ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి, అత్యవసర వైద్య చికిత్స అందేలా ప్రజలు సహకరించాలని సూచించారు. సకాలంలో చికిత్స అందించడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రజలు నిర్లక్ష్యం చేయవద్దని, బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.

అదేవిధంగా, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA