Karimnagar: కరీంనగర్ బస్టాండ్లో ఆర్టీసీ అధిక చార్జీలపై సామాజిక కార్యకర్తల నిరసన!
Karimnagar: దసరా పండుగ వేళ ఆర్టీసీ బస్సుల్లో అధిక చార్జీల వసూళ్లపై కరీంనగర్ బస్టాండ్లో సామాజిక కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.
Karimnagar: కరీంనగర్ బస్టాండ్లో ఆర్టీసీ అధిక చార్జీలపై సామాజిక కార్యకర్తల నిరసన!
Karimnagar: సామాజిక కార్యకర్తలు కోట శ్యామ్ కుమార్, బెల్లపు కరుణాకర్ కరీంనగర్ బస్టాండ్ లో నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఆన్లైన్ లో 265 రూపాయలు ఉన్న టికెట్ కి 410 రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కరీంనగర్ బస్టాండ్ లో నిరసన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫోన్ చేసిన సరైన సమాధానం చెప్పడం లేదని అన్నారు.
అధిక చార్జీలు కనీసం ఎందుకు ఏవిధంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారో కూడా ఆ టికెట్ లో ఇవ్వడం లేదని ఎవరికి ఫోన్ చేసి అడిగిన సరైన సమాధానం రాలేదని అందుకే నిరసన చేపట్టామని తెలిపారు. ప్రయాణికుడు తీసుకున్న ప్రతి టికెట్పై ఏ విధమైన చార్జీలు వసూలు చేస్తున్నారు ఎంత దూరం ప్రయాణిస్తున్నారు ఎంత ఛార్జ్ అనేది వివరాలు ఉంటుంది అలాంటిది వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు.
ఈ అడ్డగోలు దోపిడిని అరికట్టకుంటే దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆడవాళ్లు ప్రయాణించే ఫ్రీ బస్ కి ప్రభుత్వానికి డబ్బులు ఉన్నాయి కానీ మగవాళ్ళు ప్రయాణించే టికెట్టుకు మాత్రం అధిక ధరలు చెల్లించాలా అని నిలదీశారు. పండగలకు ఇష్టాను సారంగా టికెట్ పై వసూలు చేయడం ఎందుకు ? అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.




