Siricilla: TRS యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సయ్యద్ సాదిక్ నియామకం!
Siricilla: TRS యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా గంభీరావుపేటకు చెందిన సయ్యద్ సాదిక్ నియామకం. నియామక ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత.
Siricilla: TRS యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సయ్యద్ సాదిక్ నియామకం!
Siricilla: గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన సయ్యద్ సాదిక్‌ను TRS యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా సయ్యద్ సాదిక్ తనకు కీలకమైన పదవిని అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలు కవితకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని పేర్కొన్నారు. పార్టీ పటిష్టత కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షురాలు కవిత ప్రవేశపెట్టిన పాంచజన్యం (ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం) కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని సయ్యద్ సాదిక్ వెల్లడించారు.
తన నియామకానికి సహకరించిన యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల శివారెడ్డి, జిల్లా అధ్యక్షులు సంకెపల్లి సుమలత, సుధాకర్ శర్మ, జగిత్యాల జిల్లా ఇన్‌చార్జి పవన్ రావు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి మజీద్‌లకు సయ్యద్ సాదిక్ కృతజ్ఞతలు తెలిపారు.




