Siricilla: సిరిసిల్లలో ఘనంగా స్వచ్ఛత హి సేవ - 2026 కార్యక్రమం!
Siricilla: సిరిసిల్ల మున్సిపాలిటీలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పారిశుధ్య కార్మికులను సన్మానించి, మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
Siricilla: సిరిసిల్లలో ఘనంగా స్వచ్ఛత హి సేవ - 2026 కార్యక్రమం!
Siricilla: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని సిరిసిల్ల పురపాలక సంఘ కార్యాలయంలో స్వచ్ఛత హి సేవ–2026, సఫాయి మిత్ర సురక్షా ఏవం సన్మాన్ శిబిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ పారిశుధ్య కార్మికులను సన్మానించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ కలలుగన్న స్వచ్ఛ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణమవుతుందని పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో మున్సిపల్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలు వెలకట్టలేనివని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ వారి సేవలను గౌరవించాలని కోరారు.
స్వచ్ఛత హి సేవ–2026 కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్మికుల సేవలను గుర్తించి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారిని సన్మానించడం సంతోషకరమైన విషయమన్నారు.
అదేవిధంగా నిత్యం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం శ్రమించే మున్సిపల్ కార్మికుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు అశ్విని హాస్పిటల్స్, ఎల్లారెడ్డిపేట సహకారంతో మున్సిపల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో నిపుణులచే వైద్య పరీక్షలు నిర్వహించి, సంబంధిత వైద్యుల పర్యవేక్షణలో కార్మికుల ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా సలహాలు, సూచనలతో పాటు అవసరమైన మందులు అందజేయనున్నట్లు చైర్‌పర్సన్ తెలిపారు.
మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది ఈ వైద్య శిబిరం సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్మికుల్లో వైద్య శిబిరంపై నమ్మకం పెంచేందుకు చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న అశ్విని హాస్పిటల్స్ యాజమాన్యానికి ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ ఎం.డి. ఖాదిర్ ఫాషా మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులు, సిబ్బంది వైద్య శిబిరం సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ విప్ బుర్ర మల్లికార్జున్, కౌన్సిలర్ సభ్యులు వేముల రాములు, దూడం రజిని శ్రీనివాస్, ఎర్రం వెంకట్రాజ్యం, మామిడాల మహేష్, బుర్ర నారాయణ గౌడ్, కూర భాగ్యలక్ష్మి దేవరాజ్, మెరుగు మంజుల శ్రీనివాస్, బొద్దుల శ్రీనివాస్, ఎలుక వెంకటేశం, లింగంపల్లి గంగరాజు, ఆడెపు చంద్రకళ ప్రభాకర్, అడిచెర్ల రూప సాయి కృష్ణ, గెంట్యాల శ్యామల శ్రీనివాస్, మంచే రేణుక శ్రీనివాస్, పాషికంటి రమ్య సత్యనారాయణ, కొండ వర్షిని నరేష్, బత్తుల రమేష్, రిక్కమల్లె రజిత సంపత్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సోహెల్, మున్సిపల్ అధికారులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొని మున్సిపల్ కార్మికులను సన్మానించారు.




