Siricilla: ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయంలో మీసేవ ఆవిర్భావ వేడుకలు!
Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా మీసేవ ఆవిర్భావ దినోత్సవం. పాల్గొన్న తహసీల్దార్ నవ్యజ్యోతి, మీసేవ ఆపరేటర్లు.
Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మీసేవ ఆపరేటర్లు, తహసీల్దార్ ఆధ్వర్యంలో మీసేవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ నవ్యజ్యోతి మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందించడంలో మీసేవ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. డిజిటల్ తెలంగాణ నిర్మాణంలో మీసేవ సేవలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. మీసేవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజాసేవకులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన ఆన్‌లైన్ సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని మీసేవ నిర్వాహకులు గడ్డం జితేందర్, కూర రవికుమార్, లగిశెట్టి శ్రీనివాస్, మీసం నరేష్, నెవూరి మల్లేశం, సతీష్, ఆదిత్య, నర్సయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దివ్యజ్యోతి, నాయబ్ తహసీల్దార్ వేణు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు లక్ష్మణ్, సాహితీ, గ్రామ పాలన అధికారులు, తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.




