Yellareddipet: ఎల్లమ్మ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆహ్వానం

Yellareddipet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో నిర్వహించనున్న ఎల్లమ్మ ఆలయ ప్రతిష్ఠ, సిద్ధోగం వేడుకలకు హాజరుకావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆహ్వానించారు.

KALEEM, SIRICILLA
Published on: 13 Nov 2026 2:55 PM IST
Yellareddipet
X

Yellareddipet: ఎల్లమ్మ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆహ్వానం

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించనున్న ఎల్లమ్మ ఆలయ ప్రతిష్ఠాపన, సిద్ధోగం వేడుకలకు హాజరుకావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను గౌడ సంఘం నాయకులు ఆహ్వానించారు.

ఈ మేరకు బీజేపీకి చెందిన గౌడ సంఘం నాయకులు గంట బాలకృష్ణ గౌడ్, శ్రీహరి, పందిర్ల సత్తయ్యతో పాటు బీజేపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పుల్లకు వినీత్ గౌడ్ కలిసి బండి సంజయ్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సానుకూలంగా స్పందిస్తూ సిద్ధోగం వేడుకలకు హాజరవుతానని తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA