Siricilla: సిరిసిల్లలో జానపద జాతరకు కేటీఆర్‌కు ఆహ్వానం

Siricilla: సిరిసిల్లలో జరగనున్న జానపద జాతరకు కేటీఆర్‌ను ఆహ్వానించిన తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ప్రతినిధులు. జాతర విజయవంతానికి పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ.

KALEEM, SIRICILLA
Published on: 22 Oct 2026 8:27 PM IST
Siricilla
X

Siricilla: సిరిసిల్లలో జానపద జాతరకు కేటీఆర్‌కు ఆహ్వానం

సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన జానపద కళాకారుల ఆటపాటలతో సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో త్వరలో నిర్వహించనున్న జానపద జాతరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ప్రతినిధులు ఆహ్వాన పత్రిక అందించారు. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణకర్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు ఈరోజు కేటీఆర్‌ను కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ కళాకారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. తెలంగాణ కళాకారులకు సిరిసిల్ల పుట్టినిల్లు లాంటిదని అన్నారు. సిరిసిల్లలో నిర్వహించనున్న జానపద జాతర విజయవంతం కావడానికి తన సహాయ సహకారాలు అందిస్తామని, కార్యక్రమానికి అవసరమైన మద్దతు ఇస్తూ విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం జానపద జాతర నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను కళాకారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణకర్, ప్రధాన కార్యదర్శి ఎండీ సత్తర్, జడల రమేష్, గజ్వేల్ వేణు, వస్పారి కిరణ్, మద్దెల సందీప్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA