Siricilla: శ్మశానంలో నివసిస్తున్న అమృతకు బండి సంజయ్ రూ.50 వేల సాయం

Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తికి చెందిన అమృతకు రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుపై కలెక్టర్‌తో సంభాషణ.

KALEEM, SIRICILLA
Published on: 7 Nov 2026 11:04 PM IST
Siricilla
X

Siricilla: శ్మశానంలో నివసిస్తున్న అమృతకు బండి సంజయ్ రూ.50 వేల సాయం

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన మర్రిపల్లి అమృతకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అండగా నిలిచారు. సొంత ఇల్లు లేక, అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడితో కలిసి శ్మశానంలో నివసిస్తూ దుర్భర జీవితం గడుపుతున్న అమృతకు తక్షణ సాయంగా రూ.50 వేల ఆర్థిక సహాయం పంపించారు.

ఈ నగదును బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ద్వారా బాధితురాలికి అందజేశారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్‌తో కేంద్ర మంత్రి ఫోన్‌లో మాట్లాడి అమృత కుటుంబం ఎదుర్కొంటున్న దుస్థితిని వివరించారు. బాధితురాలికి తక్షణమే డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు అనారోగ్యంతో ఉన్న కుమారుడితో కలిసి శ్మశానంలో నివసిస్తున్న అమృత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలని బండి సంజయ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరైన వెంటనే ఇంటికి అవసరమైన సామగ్రితోపాటు కుటుంబానికి సరిపడా నిత్యావసర సరుకులు అందించాలని సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA