Illanthakunta: ఇల్లంతకుంటలో బిక్కవాగు వంతెన కోసం యువనేత ఆమరణ దీక్ష!

Illanthakunta: ఇల్లంతకుంట మండలం అనంతారం బిక్కవాగు వంతెన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ అప్పేం నాగరాజు ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరిక. మద్దతు తెలిపిన నేతలు.

KALEEM, SIRICILLA
Published on: 22 Sept 2026 12:22 PM IST
Illanthakunta
X

Illanthakunta: ఇల్లంతకుంటలో బిక్కవాగు వంతెన కోసం యువనేత ఆమరణ దీక్ష!

Illanthakunta: ఆనంతారం బిక్కవాగు వంతెన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువజన నాయకుడు అక్కేం నాగరాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. వంతెన పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.

అయితే దీక్ష రెండో రోజుకు చేరుకున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నాగరాజు చేపట్టిన దీక్షకు పార్టీలకతీతంగా వివిధ పార్టీల నాయకులు, యువకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కముటం రాములు, చొప్పరి రాంచంద్రం, వొళ్ళాల రవి, ఆకుల శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA