Yellareddypet: కవితక్క వెంట మహిళా ప్రభంజనం: టీఆర్‌ఎస్‌లో భారీ చేరికలు
Yellareddypet: ఎల్లారెడ్డిపేట మండలంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీలోకి మహిళలు, యువత భారీగా చేరారు. వారికి ఇన్‌చార్జ్ మజీద్ కండువాలు కప్పారు.
Yellareddypet: కవితక్క వెంట మహిళా ప్రభంజనం: టీఆర్‌ఎస్‌లో భారీ చేరికలు
Yellareddypet: ఎల్లారెడ్డిపేట మండలంలో టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు జరిగాయి. గురువారం రాగట్లపల్లి, పోతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ గ్రామాలకు చెందిన పలువురు యువత, మహిళలు, కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు.
నియోజకవర్గ నాయకులు అల్లే శంకర్, కదిరే రేణుక, సయ్యద్ జావిద్, చిన్ని పెద్ద బాల్ రెడ్డి, మండల సీనియర్ నాయకుడు కదిరే భాస్కర్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మజీద్ ఆయా గ్రామాల్లో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మజీద్ మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా మహిళలు టీఆర్‌ఎస్ అధినేత కవితక్క చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార ఉద్యమానికి ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరడం అభినందనీయమన్నారు.
కవితక్క ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర సమస్యల పరిష్కారంతో పాటు మహిళలకు మరింత ప్రాధాన్యత లభిస్తుందని మహిళలు చర్చించుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువత, యువకులు, మహిళలు, ఉద్యమకారులు, మేధావులు, కవులు, రచయితలు కవితక్క ప్రవేశపెట్టిన పాంచజన్యానికి ఆకర్షితులవుతున్నారని తెలిపారు.
కవితక్క చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార ఉద్యమానికి మద్దతుగా టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు జరుగుతున్నాయని మజీద్ పేర్కొన్నారు. పార్టీలో చేరాలనుకునే వారు 9441377068 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ నాయకులు మార్వాడి దేవరాజు, సిద్ధూ పాల్గొన్నారు.




