Sircilla: పీఆర్సీ వెంటనే అమలు చేయాలి టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
Sircilla: రాజన్న సిరిసిల్ల టీఎస్‌యూటీఎఫ్ మహాసభలో పీఆర్సీ, ఓపీఎస్, డీఏలపై డిమాండ్. జిల్లా అధ్యక్షుడిగా గుండమనేని మహేందర్ రావు, కార్యదర్శిగా జంగిటి రాజు ఎన్నిక.
Sircilla: పీఆర్సీ వెంటనే అమలు చేయాలి టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
సిరిసిల్ల: గీతానగర్ ఉన్నత పాఠశాలలో టీఎస్‌యూటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా 6వ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయడంతో పాటు బకాయిలను చెల్లించాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, గెస్ట్ ఉపాధ్యాయులకు కనీస వేతన స్కేల్ వర్తింపజేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మరో రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్ మాట్లాడుతూ గురుకుల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు అందించాలని కోరారు. గురుకులాల్లో ఉపాధ్యాయులపై అడ్మిషన్ల బాధ్యతల ఒత్తిడిని తగ్గించాలని, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో కేర్‌టేకర్లను నియమించి ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని అన్నారు. ప్రతి గురుకులానికి ఇద్దరు హెల్త్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీఎస్‌యూటీఎఫ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
మహాసభలో టీఎస్‌యూటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గుండమనేని మహేందర్ రావు, ప్రధాన కార్యదర్శిగా జంగిటి రాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా అంబటి రమేష్, నెల్లుట్ల లత, కోశాధికారిగా తిరుపతి జాదవ్ ఎన్నికయ్యారు.
జిల్లా కార్యదర్శులుగా గాలిపెల్లి సంతోష్, తుమ్మనపల్లి నరేష్, పాముల స్వామి గౌడ్, కొత్వాల్ ప్రవీణ్, జెల్ల అరవింద్, సుంకె అంబేడ్కర్, చేకుట రాజశేఖర్ ఎన్నిక కాగా, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా వంగ మల్లేశం ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ నాయకులు, ప్రాథమిక సభ్యులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




