Sircilla: సిరిసిల్లలో పట్టణ పద్మశాలి సంఘం కార్యాలయం ప్రారంభం!
Sircilla: సిరిసిల్లలో పట్టణ పద్మశాలి సంఘం కార్యాలయం ప్రారంభమైంది. రూ.10 సభ్యత్వంతో 60 వేల మందిని చేర్పించి, పద్మశాలి ఎమ్మెల్యేను గెలిపించుకుంటామని వల్లకాటి రాజ్‌కుమార్ వెల్లడించారు.
Sircilla: సిరిసిల్లలో పట్టణ పద్మశాలి సంఘం కార్యాలయం ప్రారంభం!
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, పద్మశాలీల ఆత్మగౌరవం, ఐక్యత, సంఘటిత శక్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
సంఘంలో కేవలం పది రూపాయల సభ్యత్వంతో పద్మశాలీలను భాగస్వాములను చేసి, పట్టణవ్యాప్తంగా 50 నుంచి 60 వేల మంది సభ్యులను చేర్చే లక్ష్యంతో ముందుకు సాగనున్నట్లు తెలిపారు. పద్మశాలీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు, రాబోయే ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అసెంబ్లీకి పంపేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. అధ్యక్షుడిగా నాగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మాదాస్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా గుంటుక పురుషోత్తం, సహాయ కార్యదర్శిగా జిందం రవీందర్, కోశాధికారిగా దాసరి వెంకటేష్ బాధ్యతలు చేపట్టారు. కార్యవర్గ సభ్యులుగా గాజుల సదానందం, దూడం సురేష్, తాటిపాముల సత్యనారాయణ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా పద్మ పీఠం ఎడిటర్ కొక్కుల భాస్కర్, మార్కండేయ జయంతి ఉత్సవ సమితి కన్వీనర్ మోర శ్రీనివాస్, దుబ్బాక పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గాలయ్య, మాజీ కౌన్సిలర్లు గుడూరి భాస్కర్, పత్తిపాక పద్మశంకర్ హాజరయ్యారు.
అలాగే జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షుడు గొనె ఎల్లప్ప, అరుకాల రమేష్, దేవనపల్లి రామకృష్ణతో పాటు పద్మశాలి కులబాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




