Sircilla: ఆసుపత్రిలో వ్యక్తి మృతి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ధర్నా
Sircilla: సిరిసిల్ల నరేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన, ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం.
Sircilla: ఆసుపత్రిలో వ్యక్తి మృతి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ధర్నా
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని నరేష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తంగళ్లపల్లి మండలానికి చెందిన కంకణాల అంజయ్య (45) మృతి చెందారు.
నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో అనారోగ్యంతో కుటుంబ సభ్యులు అంజయ్యను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఈరోజు ఉదయం హార్ట్ స్ట్రోక్‌తో అంజయ్య మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.
అయితే అంజయ్య మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడంటూ ఆరోపిస్తూ.. న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అంజయ్య మృతిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.




