Sircilla: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆసక్తికర దృశ్యం!
Sircilla: సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల రథోత్సవంలో ఎమ్మెల్యే కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎదురుపడి ఆత్మీయంగా పలకరించుకున్నారు.
Sircilla: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆసక్తికర దృశ్యం!
రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన రథోత్సవం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎదురుపడి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇద్దరు నాయకులు చేతిలో చేయి వేసి పరస్పరం పలకరించుకోవడం అక్కడి వారిని ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని వీక్షించిన ప్రజలు ఆసక్తి కనబరిచారు.




