Sircilla: సిరిసిల్లలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు నమోదు క్యాంపులు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈనెల 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
Sircilla: సిరిసిల్లలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు నమోదు క్యాంపులు!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటర్ల నమోదుకు ఈ నెల 15, 16 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు, తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే యువత సంబంధిత పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ రెండు రోజుల పాటు ఆయా కేంద్రాల్లో సంబంధిత బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) అందుబాటులో ఉంటారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.




