Sircilla: సిరిసిల్లలో సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
Sircilla: సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.
Sircilla: సిరిసిల్లలో సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
సిరిసిల్ల: ఈ నెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించారు.
వీవీఐపీ భద్రత, బందోబస్తు విధులు, సభా ప్రాంగణం, హెలిప్యాడ్ భద్రత, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్‌లో బందోబస్తు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ క్లియరెన్స్, ప్రజల రాకపోకల నియంత్రణ, అత్యవసర పరిస్థితుల నిర్వహణ, పోలీస్ సిబ్బంది విధుల కేటాయింపు తదితర అంశాలను ఎస్పీ సమీక్షించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ప్రతి ప్రాంతంలో భద్రతా చర్యలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. వివిధ జిల్లాల నుంచి బందోబస్తు విధుల కోసం వచ్చే అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు.
ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్‌లో ముందస్తు తనిఖీలు నిర్వహించి రూట్ క్లియరెన్స్‌ను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. సభా ప్రాంగణంలోకి ప్రవేశించే వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని, అవసరమైన చోట మెటల్ డిటెక్టర్లు, ఇతర భద్రతా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




