Sircilla: సిరిసిల్ల డీపీఓలో పోలీస్ గ్రీవెన్స్ డే: 19 ఫిర్యాదుల స్వీకరణ

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ మహేష్ బి. గితే 19 ఫిర్యాదులు స్వీకరించి తక్షణ పరిష్కారానికి ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 21 Sept 2026 4:39 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల డీపీఓలో పోలీస్ గ్రీవెన్స్ డే: 19 ఫిర్యాదుల స్వీకరణ

సిరిసిల్ల: బాధితుల సమస్యలను పరిష్కరించి వారికి సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి మొత్తం 19 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా పోలీస్ శాఖ కృషి చేస్తోందన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి వినతులు, ఫిర్యాదులను స్వీకరించాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి, చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

దీంతో ఫిర్యాదుదారుల్లో పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. గ్రీవెన్స్ డేలో స్వీకరించిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావచ్చని, సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA