Sillsilla: మద్యం మత్తులో కన్నతల్లిపైనే దాడి.. పెద్ద బోనాలలో కలకలం!
Sillsilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్ద బోనాల దసరా వేళ దారుణం జరిగింది. మద్యం మత్తులో కన్నతల్లి బుధవ్వ(70)పై కొడుకు మల్లయ్య రోకలితో దాడి చేశాడు.
Sillsilla: మద్యం మత్తులో కన్నతల్లిపైనే దాడి.. పెద్ద బోనాలలో కలకలం!
Sillsilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్ద బోనాల గ్రామంలో దసరా పండుగ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న మల్లయ్య అనే వ్యక్తి తన తల్లి బండి బుధవ్వ (70)పై రోకలిబండతో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవ్వకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు మల్లయ్య ఉన్నారు. దసరా పండుగ రోజున మద్యం సేవించి ఇంటికి వచ్చిన మల్లయ్య తల్లితో గొడవకు దిగి, క్షణికావేశంలో ఇంట్లోని రోకలిబండతో ఆమె తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో బుధవ్వ కిందపడిపోయింది.
వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. పండుగ వేళ కన్నతల్లిపైనే కుమారుడు దాడికి పాల్పడిన ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
ఘటనపై పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




