Sircilla: ముస్తాబాద్‌లో నిలిచి ఉన్న స్కూల్ బస్సును ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో తప్పిన పెను ప్రమాదం. రోడ్డు పక్కన నిలిపి ఉన్న స్కూల్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం.

KALEEM, SIRICILLA
Published on: 11 Nov 2026 12:54 PM IST
Sircilla
X

Sircilla: ముస్తాబాద్‌లో నిలిచి ఉన్న స్కూల్ బస్సును ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో స్కూల్ బస్సును మరో ప్రైవేటు పాఠశాలకు చెందిన టాటా ఏస్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో రెండు వాహనాల్లోనూ విద్యార్థులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు బుధవారం ఉదయం వెంకట్రావుపల్లె గ్రామం నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకువచ్చేందుకు వెళ్లింది. గ్రామ శివారులో బస్సు డ్రైవర్ మూత్ర విసర్జన కోసం వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి వెళ్లాడు.

ఇదే సమయంలో బంధనకల్ గ్రామానికి చెందిన మరో ప్రైవేటు పాఠశాల టాటా ఏస్ వాహనం సిద్దిపేట వైపు వెళ్తూ రోడ్డు పక్కన నిలిపి ఉన్న స్కూల్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనం తీవ్రంగా దెబ్బతినగా, స్కూల్ బస్సు వెనుక భాగంలోని అద్దాలు పగిలిపోయాయి.

ప్రమాదం జరిగిన సమయంలో రెండు వాహనాల్లోనూ విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA