Sircilla: నవంబర్ 1న సిరిసిల్లలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలు!
Sircilla: నవంబర్ 1న సిరిసిల్లలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకల ఆహ్వాన పత్రికను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డికి అందజేశారు.
Sircilla: నవంబర్ 1న సిరిసిల్లలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలు!
Sircilla: సిరిసిల్లలో నవంబర్ 1న నిర్వహించనున్న తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు హాజరై, విజయవంతం చేయడానికి సహకరించాలని కోరుతూ తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం కన్వీనర్ ఎం.డి. సత్తార్ ఆధ్వర్యంలో ప్రతినిధులు శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. వేడుకలకు ఆహ్వానిస్తూ, జానపద కళాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం అందేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా జానపద కళాకారులు సినిమా రంగానికి దీటుగా నాణ్యమైన పాటలను రూపొందిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారని, అయితే పెరుగుతున్న పెట్టుబడుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు వివరించారు. సినిమా రంగానికి అందిస్తున్నట్లుగానే జానపద రంగానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని కోరారు.
దీనిపై కేకే మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిరిసిల్ల నియోజకవర్గంలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం సిరిసిల్లకు గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరవుతానని, తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రముఖ జానపద కళాకారులు, టెక్నీషియన్లు, నిర్మాతలు కలిసి నిర్వహిస్తున్న ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో కళాకారులు హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ప్రచార కార్యదర్శి ఆకునూరి దేవయ్య, సభ్యులు నక్క శ్రీకాంత్, శ్రీరాముల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.




