Sircilla: రెడ్డి విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి: గుండారపు కృష్ణారెడ్డి

Sircilla: రాజా బహదూర్ వెంకటరామారెడ్డి జయంతి వేళ సిరిసిల్లలో ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించిన జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి.

KALEEM, SIRICILLA
Published on: 27 Sept 2026 7:27 PM IST
Sircilla
X

Sircilla: రెడ్డి విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి: గుండారపు కృష్ణారెడ్డి

సిరిసిల్ల: విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అన్నారు.

ఆదివారం శ్రీ రాజా బహదూర్ వెంకటరామారెడ్డి జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు పురస్కారాలు అందజేసి సత్కరించారు.

ఈ సందర్భంగా గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బహదూర్ వెంకటరామారెడ్డి చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ ఆయన మార్గాన్ని అనుసరించాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి విద్యార్థులకు అండగా నిలుస్తామని, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున పేద విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.

రెడ్డి సంక్షేమ సంఘం పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. భవిష్యత్‌లో అందరి సహకారంతో సంఘాన్ని రాష్ట్రంలోనే ఉన్నతంగా నిలబెడతామని పేర్కొన్నారు. జిల్లాలో రెడ్డి సామాజికవర్గం ఐక్యంగా ఉండాలని, విద్య, ఉద్యోగ, రాజకీయ, వ్యాపార రంగాల్లో మరింతగా రాణించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపడతామని తెలిపారు. రెడ్డి సామాజికవర్గంపై తీన్మార్ మల్లన్న వంటి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు.

ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అభినందించిన ఆయన.. మిగతా విద్యార్థులు కూడా కష్టపడి చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వన్నెల మమత, మున్సిపల్ కౌన్సిలర్ జ్యోతి, జిల్లా ఉత్తమ సర్పంచ్ అర్పితరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు కూర అంజిరెడ్డి, కోర్ కమిటీ సభ్యులు పుర్మాని రామలింగారెడ్డి, పాతూరి మహేందర్‌రెడ్డి, పొన్నాల బాలరెడ్డి, రాఘవరెడ్డి, తిరుమల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, రాఘవరెడ్డి, నరసింహారెడ్డి, తిరుపతిరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, ప్రమోద్‌రెడ్డి, జలజరెడ్డి, కనకరెడ్డి, హనుమంతరెడ్డి, నీలిమరెడ్డి, ప్రేమ్‌సాగర్‌రెడ్డి, కంకణాల శ్రీనివాస్‌రెడ్డి, మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, గడ్డం సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA