Sircilla: ఇల్లంతకుంట మండలంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన రసమయి బాలకిషన్!

Sircilla: ఇల్లంతకుంట మండలంలో మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కుల సంఘాల అధ్యక్షులకు సత్కారం.

KALEEM, SIRICILLA
Published on: 8 Nov 2026 8:09 AM IST
Sircilla
X

Sircilla: ఇల్లంతకుంట మండలంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన రసమయి బాలకిషన్!

Sircilla: ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లె, తాళ్లపెల్లి గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన వారి కుటుంబాలను మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, అధైర్యపడవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

అనంతరం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓర్పుల రాములు యాదవ్ ఇల్లంతకుంట మండల యాదవ సంఘం అధ్యక్షుడిగా, సోమారిపేట గ్రామానికి చెందిన నర్సాగౌడ్ మండల గౌడ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వారిని రసమయి బాలకిషన్ శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, చెరుకుపల్లి రాజిరెడ్డి, ఏండ్ర చందన్, రడం ప్రవీణ్, ఓర్పుల రాములు యాదవ్, ఐరెడ్డి రవీందర్ రెడ్డి, గైని నర్సాగౌడ్, దుద్దెడ బాలగౌడ్, పత్తిరి అంజయ్య, వంగ జ్ఞానేశ్వర్ గౌడ్, ఏండ్ర యాదగిరి, జెట్టి మల్లయ్య, జెట్టి లచ్చయ్య, కుమ్మరవేణి రఘుపతి, రాచకొండ అనిల్, సొల్లు ప్రకాష్, రేపాక కనకయ్య, ఏండ్ర తాపల్, ఏండ్ర మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA